సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు: బండి సంజయ్

By narsimha lode  |  First Published May 22, 2023, 2:58 PM IST

పార్టీ క్రమశిక్షణను  ఉల్లంఘించే వారిపై  చర్యలు తీసుకుంటామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.


హైదరాబాద్:   వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో టిక్కెట్లు  కావాలనుకొనే వారంతా  ప్రజల మధ్యే ఉండాలని బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  చెప్పారు. సోమవారంనాడు  హైద్రాబాద్ లో  బీజేపీ  రాష్ట్ర  కార్యవర్గ సమావేశంలో  బండి సంజయ్  ప్రసంగించారు.  క్షేత్రస్థాయిలో  పనిచేసేవారికే    టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత  ఇస్తామన్నారు. సర్వేల  ఆధారంగానే  ఎన్నికల్లో  అభ్యర్ధులకు టిక్కెట్లు  కేటాయించనున్నట్టుగా   బండి సంజయ్  తేల్చి  చెప్పారు.

బీజేపీ  క్రమశిక్షణ గల పార్టీ   అని  ఆయన గుర్తు  చేశారు. పార్టీ   నిబంధనలను ఉల్లంఘించిన వారిపై   కఠినంగా  వ్యవహరిస్తామని బండి సంజయ్ వార్నింగ్  ఇచ్చారు.ఈ ఏడాది   చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో తెలంగాణలో  అధికారం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహారచన  చేస్తుంది.  ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలో  బీజేపీ వరుసగా  రెండో దఫా అధికారం దక్కించుకోవడంలో  కీలక పాత్ర  పోషించిన  సునీల్ భన్సల్ ను  ఆ పార్టీ  తెలంగాణ ఇంచార్జీగా  నియమించింది.  సునీల్ భన్సల్ టీమ్  రాష్ట్రంలో  కార్యక్రమాలు నిర్వహిస్తుంది.  క్షేత్రస్థాయిలో  బీజేపీ విస్తరణకు  భన్సల్ టీమ్   పనిచేస్తుంది. 

Latest Videos

మరో వైపు  ఇతర పార్టీల్లోని  అసంతృప్తులను  తమ వైపునకు  తిప్పుకొనేందుకు గాను   మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని  కమిటీ కూడా  పనిచేస్తుంది. ఇదిలా ఉంటే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  ఓటమి  ఆ పార్టీ  క్యాడర్ లో  కొంత  నిరుత్సాహన్ని నింపింది.  కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై  ఎలాంటి ప్రభావం  చూపబోవని  బీజేపీ  నేతలు   ధీమాగా  ఉన్నారు.  బీజేపీ  అగ్రనేతలతో  రాష్ట్రానికి  చెందిన పలువురు నేతలు  గత  వారంలో  సమావేశమయ్యారు. తెలంగాణలో  అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు.
 

click me!