జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ షాక్

By telugu teamFirst Published Nov 17, 2020, 5:27 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ షాక్ ఇచ్చారు. జనసేనతో పొత్తు లేదనే విషయాన్ని ఆయన తేల్చేశారు దీని వెనక కారణం లేకపోలేదు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చారు జనసేనతో పొత్తు తెలంగాణకు వర్తించదని బండి సంజయ్ తేల్చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీ దించుతుతామని ఆయన చెప్పారు 

జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలంగాణకు కూడా వర్తిస్తుందని భావించారు. కానీ, సంజయ్ తెలంగాణకు ఆ పొత్తు వర్తించదని తేల్చేశారు. దీంతో జనసేన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. జనసేన ఎంత మంది అభ్యర్థులను పోటీకి దించుతుందని తేలాల్సి ఉంది.

Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలు: పోటీకి జనసేన రెడీ

మరో వైపు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. ఇటీవల చంద్రబాబు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో బలంగా ఉన్న టీడీపీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. హైదరాబాదు అభివృద్ధి తనవల్లనే జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే ప్రధాన అంశంగా టీడీపీ రంగంలోకి దిగుతోంది.

కాగా, కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను రంగంలోకి దించనున్నాయి. మజ్లీస్ కు దాదాపు 50 స్థానాల్లో గట్టి పట్టు ఉంది. టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి పోటీ చేస్తాయా, విడివిడిగా పోటీ చేస్తాయా అనేది తేలాల్సి ఉంది. అయితే, ఇరు పార్టీల మధ్య ఓ అవగాహన ఉంటుందనేది మాత్రం స్పష్టం. 

Also  Read: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదు: తేల్చేసిన బండి సంజయ్

బిజెపి జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ జిహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహరచన చేసి, అమలు చేయనున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంట్ ముందుకు రావచ్చుననే ఉద్దేశంతో బిజెపి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ముందుకు వచ్చి టీఆర్ఎస్ లాభపడకుండా చేయడమే బిజెపి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా, మజ్లీస్ ను తన ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి ఎంచుకుంటోంది. దానివల్ల కూడా తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టడానికి వీలవుతుందనే ఉద్దేశం బిజెపి నాయకుల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. మజ్లీస్ ను ప్రధాన ప్రత్యర్థిగా చూపించడం వెనక బిజెపి వ్యూహం ఏమిటనేది అందరికీ తెలిసిందే. 

click me!