హిందూవాహిని కార్యకర్తలపై వేధింపులు: పోలీసులపై బండి సంజయ్ ఫైర్

Published : Mar 16, 2021, 04:48 PM IST
హిందూవాహిని కార్యకర్తలపై వేధింపులు: పోలీసులపై బండి సంజయ్ ఫైర్

సారాంశం

తెలంగాణలో రాక్షస ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో రాక్షస ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హిందూవాహిని కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.పోలీసుల తీరుపై జ్యూడిషీయల్ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైంసాలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇక రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల వెంట పడతామని ఆయన హెచ్చరించారు.

కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బండి సంజయ్ ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. పోలీసులు కొందరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు చేస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఐ స్థాయి అధికారులు మాత్రం తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు.

అధికారులు తమ విధులను నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఫిర్యాదు చేస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.

 


 

PREV
click me!

Recommended Stories

Telangana Politics : రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారా..? మంత్రుల భేటీవెనక అసలు సంగతేంటి..?
Jio AI Education : జియో ఏఐ ఎడ్యుకేషన్.. విద్యార్థులకు, టీచర్లకు రూ. 35 వేల విలువైన ప్లాన్ ఉచితం !