స్వేరోస్ సంస్థ తీరుపై బండి సంజయ్ ఫైర్.. చర్యలకు డిమాండ్..

Published : Mar 16, 2021, 04:38 PM IST
స్వేరోస్ సంస్థ తీరుపై బండి సంజయ్ ఫైర్.. చర్యలకు డిమాండ్..

సారాంశం

స్వేరోస్ సంస్థ సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తోందని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. స్వేరోస్ సంస్థ తీరు వివాదాస్పదంగా మారుతోందని, ఆ సంస్థ తీరుమీద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. సంస్థ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా అని నిలదీశారు. అంతేకాదు హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. 

నేను వాళ్లను పూజించను.. వివాదాస్పదంగా స్వేరో ప్రతిజ్ఞ... (వీడియో)

రాష్ట్రంలో చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన.. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెల్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.  ప్రజల నుంచి వ్యతిరేకత ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
 
PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu