ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకొనే కుట్రలు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

Published : Apr 12, 2022, 03:30 PM ISTUpdated : Apr 12, 2022, 03:47 PM IST
ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకొనే కుట్రలు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

సారాంశం

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొనేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యాత్రను  కొనసాగిస్తామని సంజయ్ తెలిపారు.

హైదరాబాద్:  Praja Sangrama Yatra యాత్రను అడ్డుకునేందుకు KCR ప్రయత్నాలు చేస్తున్నారని BJP  తెలంగాణ రాష్ట్ర బండి సంజయ్ ఆరోపించారు.

మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశంలో Bandi Sanjay  మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రైతుల ముసుగులో ప్రజా సంగ్రామ యాత్రపై  దాడులు చేసేలా KCR  కుట్ర పన్నారన్నారు. అంతేకాదు తమ పార్టీకి చెందిన 
నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల కోసం  రాళ్ల దాడులనైనా భరించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఎదురు దాడి చేయకుండా తాము సంయమనం పాటిస్తామన్నారు.ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామన్నారు. TRS  అరాచకాలు, అవినీతిని ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాననడం హాస్యాస్పదమన్నారు. Delhiలో గంట సేపు కూడా దీక్ష చేయలేని కేసీఆర్ దేశంలో  రాజకీయ ప్రకంపనలు ఎలా చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతను ఈ నెల 14వ తేదీ నుండి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆలంపూర్ ఆలయం నుండి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. 2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.  రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను  బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.  వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, బీజేపీ వైఖరి ఏమిటనే విషయాలను కూడా ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది.  వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని బూచిగా చూపి పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని కూడా బీజేపీ అనుమానిస్తుంది. రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా యాత్రను కొనసాగిస్తూనే రైతులకు టీఆర్ఎస్ వ్యవహరశైలిని కూడా వివరించాలని కమల దళం భావిస్తుంది. 

2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్