మునుగోడులో ఓటమిపై బీజేపీ పోస్టుమార్టం: కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపనున్ననేతలు

By narsimha lode  |  First Published Nov 7, 2022, 10:25 PM IST

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమిపై  బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోస్టు మార్టం నిర్వహిస్తుంది. ఓటమిపై ఓ నివేదికను తయారు చేసి  జాతీయ నాయకత్వానికి పంపనున్నారు రాష్ట్రనేతలు


హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికలో ఓటమిపై  బీజేపీ రాష్ట్ర  నాయకత్వం  పోస్టు  మార్టం నిర్వహించింది. ఇవాళ  సాయంత్రం పార్టీ కార్యాలయంలో  నేతలు సమావేశమయ్యారు.మునుగోడు ఉప ఎన్నికలో  బీజేపీ ఓటమి పాలైంది. ఈ స్థానంలో  టీఆర్ఎస్ విజయం  సాధించింది. ఈ ఎన్నికను  టీఆర్ఎస్ ,బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ మునుగోడులో  బీజేపీ  ఓటమి  పాలైంది.మునుగోడులో  ఓటమికి  గల   కారణాలపై ఆ పార్టీ  నాయకులు  ఇవాళ  సమీక్ష  నిర్వహించారు. పార్టీ  కోర్ కమిటీ సభ్యులు,  స్టీరింగ్ కమిటీ  సభ్యులు, ముఖ్యనేతలు  ఈ  సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడులో ఓటమికి గల కారణాలపై  చర్చించారు.ఓటమికి గల కారణాలపై ఓ నివేదికను  పార్టీ  జాతీయ   నాయకత్వానికి  కూడ పంపనుంది  బీజేపీ రాష్ట్రనాయకత్వం.

మునుగోడు  ఉప ఎన్నికలో ఎందుకు ఓటమి పాలయ్యామనే విషయమై నేతలు  తమ అభిప్రాయాలను సమావేశంలో చెప్పారని  సమాచారం. ఈ  ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని బీజేపీ ధీమాగా ఉన్నప్పటికీ పలితం  మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా  వచ్చింది.

Latest Videos

మునుగోడుఉప ఎన్నికల్లో విజయం  సాధిస్తే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమార్పులు  ఉంటాయని కమలదళం  భావించింది.  అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ  భారీగా  ఆశలను పెట్టుకుంది. విజయం  సాధిస్తామని  ఆ పార్టీ నేతలు   ధీమాతో ఉన్నారు.  కానీ ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రం  విజయం దక్కలేదు.  కానీ గత ఎన్నికలతో పోలిస్తే భారీగానే ఓట్లను దక్కించుకుంది. 

also read:ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు: కూసుకుంట్లను అభినందించిన కేసీఆర్

ఈ ఉప ఎన్నికల  సమయంలోనే బీజేపీ స్టీరింగ్  కమిటీ సభ్యులుగా ఉన్న  శ్రవణ్ , స్వామిగౌడ్ లు బీజేపీని  వదిలి  టీఆర్ఎస్ లో చేరారు. దీంతో   బీజేపీ  నాయకత్వం తన  వ్యూహన్ని  మార్చుకోవాల్సిన అనివార్య  పరిస్థితులు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల  ప్రచారం సాగుతున్న  సమయంలోనే  మొయినాబాద్  ఫాంహౌస్ అంశం వెలుగు చూసింది. నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు  బీజేపీ ప్రయత్నించిందని  టీఆర్ఎస్  ఆరోపించింది. అంతేకాదు  దీని వెనుక బీజేపీ అగ్రనేతలు కూడా ఉన్నారని కూడా  ఆరోపణలు చేసింది.  రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్  లను  పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ అంశానికి సంబంధంతో తమకుసంబంధం  లేదని  బీజేపీ  ప్రకటించింది. ఈ  విషయమై  బీజేపీ   రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారు. కేసీఆర్ ను కూడ యాదాద్రి   ఆలయంలో  ప్రమాణం  చేసేందుకు రావాలని  సవాల్  చేశారు.
 

click me!