గద్వాల న్యూడ్ వీడియో కాల్స్ కేసు: ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు

By narsimha lode  |  First Published Nov 7, 2022, 7:09 PM IST

గద్వాలలోని కేటీదొడ్డి  ఎస్ఐ హరిప్రసాద్ ను  నాగర్  కర్నూల్  డీఎస్ బీకి బదిలీ చేశారు.  నాగర్  కర్నూల్ డీఎస్‌బీ ఎస్ఐగా ఉన్న వి.వెంకటేష్ ను   కేటీ దొడ్డికి బదిలీ చేశారు. 


గద్వాల: గద్వాలలో న్యూడ్  వీడియో కాల్స్ వ్యవహరంలో  కేటీదొడ్డి ఎస్ఐ హరిప్రసాద్  పై  జిల్లా ఎస్పీ  చర్యలు తీసుకున్నారు.నాగర్ కర్నూల్  డీఎస్‌బీ  కార్యాలయానికి ఎస్ఐని బదిలీ చేశారు.ఈ  మేరకు జిల్లా  ఎస్పీ సోమవారం నాడు ఆదేశాలు జారీ  చేశారు. 

గద్వాలలో న్యూడ్ వీడియోల వ్యవహరం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిందితుల  నుండి ఎస్ఐ లంచం  తీసుకున్నారనే  ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు  మట్టి,ఇసుక మాఫియాకు  ఎస్ఐ అనుకూలంగా   వ్యవహరించారనే  ఆరోపణలున్నాయి. ఈ విషయమై అంతర్గతంగా విచారణ నిర్వహించి  ఎస్ఐపై బదిలీ వేటు  వేసిందని  ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం  ప్రసారం చేసింది.నాగర్ కర్నూల్ డీఎస్ బీలో  పని చేస్తున్న వి. వెంకటేష్ ను  గద్వాలలోని కేటీదొడ్డి ఎస్ఐగా  బదిలీ చేసింది.

Latest Videos

also read:గద్వాల : న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ కేసు... డీఎస్పీ ఏమన్నారంటే..?

గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్స్  రికార్డింగ్  వ్యవహరంపై  పోలీసు శాఖ  సుమోటో గా కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై  ఇద్దరిపై కేసు నమోదు  చేసింది. మహేశ్వర్ రెడ్డి,నిఖిల్ లు  ప్రేమ  పేరుతో  యువతులను ట్రాప్  చేశారని  పోలీసులు చెబుతున్నారు.ఈ కేసుతో  సంబంధం ఉన్న ఒకరిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ కేసుపై  ప్రత్యేక బృందంతో విచారణ  చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు. న్యూడ్  వీడియో  కాల్స్   కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి మధ్య విబేధాల కారణం విషయం బయటకు వచ్చిందని సమాచారం. ఈ వీడియోలను   సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ  వీడియోలను ఎవరెవరు  పోషల్  మీడియాలో  పోస్టు  చేశారనే  విషయమై  కూడా  పోలీసులు  ఆరా  తీస్తున్నారు.

click me!