రఘునందన్ రావు వ్యాఖ్యల చిచ్చు: తరుణ్ చుగ్, జేపీ నడ్డాకు నివేదిక పంపిన బీజేపీ

By narsimha lode  |  First Published Jul 4, 2023, 11:54 AM IST

దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు  చిట్ చాట్ లో  చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వానికి పంపారు తెలంగాణ బీజేపీ నేతలు.  రఘునందన్ రావు  వ్యాఖ్యలను ట్రాన్స్ లేట్ చేసి  పంపారు  నేతలు.


హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ అధిష్టానంపై  చేసిన వ్యాఖ్యలను   పార్టీ నేతలు  అధిష్టానానికి  పంపారు. న్యూఢిల్లీలో  సోమవారంనాడు బీజేపీకి చెందిన దుబ్బాక  ఎమ్మెల్యే రఘునందన్ రావు   మీడియాతో చిట్ చాట్  చేశారు.  ఈ చిట్ చాట్ లో  బీజేపీ జాతీయ నాయకత్వం, నేతలు , రాష్ట్ర నేతలపై  తీవ్ర విమర్శలు  చేశారు. ఈ వ్యాఖ్యలు  బీజేపీలో  కలకలం రేపాయి.  

ఈ వ్యాఖ్యలపై  రఘునందన్ రావు  సోమవారంనాడు రాత్రి న్యూఢిల్లీలో వివరణ ఇచ్చారు. తాను   న్యూఢిల్లీలో  మీడియా సమావేశం  ఏర్పాటు  చేయలేదని  చెప్పారు.  ఏదైనా మాట్లాడితే  మీడియా సమావేశం ఏర్పాటు  చేసి మాట్లాడుతానన్నారు.   తాను  చేసినట్టుగా మీడియా  ప్రసారం చేస్తున్న  వార్తలను  ఉపసంహరించుకోవాలని  రఘునందన్ రావు  కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  కేంద్ర మంత్రి అమిత్ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాపై  కూడ రఘునందన్ రావు చిట్ చాట్ లో  వ్యాఖ్యలు చేశారని  మీడియా రిపోర్టు  చేసింది. 

Latest Videos

రఘునందన్ రావు  వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నాయకత్వానికి  పంపారు రాష్ట్ర నాయకులు.  టీవీ చానల్స్ వచ్చిన  కథనాలు,  పత్రికల్లో  వచ్చిన వార్తలను  ట్రాన్స్ లేట్  చేసి  పంపారు  బీజేపీ తెలంగాణ నేతలు.   బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ  తరుణ్ చుగ్,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాలకు  బీజేపీ నేతలు  రఘునందన్ రావు  వ్యాఖ్యల  సారాంశాన్ని  ట్రాన్స్ లేట్ చేసి పంపారు. అంతేకాదు  మీడియాలో వచ్చిన  క్లిప్పింగ్ లను  కూడ  పంపారు.రఘునందన్ రావు  వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటుందోననే  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

also read:ఆ వ్యాఖ్యలు చేయలేదు, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాను: రఘునందన్ రావు వివరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవి,   బీజేపీ శాసనసభపక్ష పదవిని  ఇవ్వాలని  రఘునందన్ రావు  ఆ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.   ఇదే విషయమై  రఘునందన్ రావు  నిన్న న్యూఢిల్లీకి వెళ్లినట్టుగా  ప్రచారం సాగుతుంది.  కానీ  తన నియోజకవర్గంలో అభివృద్ధి  పనుల  గురించి  నిధుల మంజూరు  కోసం  న్యూఢిల్లీకి వచ్చినట్టుగా  రఘునందన్ రావు  నిన్న మీడియాకు  చెప్పారు.
 

click me!