టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు:స్వాగతించిన బండి సంజయ్

By narsimha lode  |  First Published Oct 18, 2022, 2:55 PM IST

కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని టీఆర్ఎస్  దాఖలు చేసిన పిటిషన్ ను  హైకోర్టు కొట్టివేయడాన్నిబండి సంజయ్   స్వాగతించారు.ఓటమి భయంతోనే టీఆర్ఎస్  తమపై  దుష్ప్రచారం చేస్తుందన్నారు.



నల్గొండ:కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్నిబీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  స్వాగతించారు.

మంగళవారం నాడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ నల్గొండలో ఆయన  మీడియాతో మాట్లాడారు.ఓటమి భయంతో  ఉపఎన్నికను నిలిపివేయాలని టీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందన్నారు. మునుగోడులో  అభివృద్ది జరిగితే 16 మంది మంత్రులు ఎందుకు  ప్రచారం  చేస్తున్నారో చెప్పాలని బండి  సంజయ్  కోరారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్  పామ్  హౌస్ కి వెళ్తారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే  బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్  చెప్పారు.

Latest Videos

మునుగొడులో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతుండటం తో కేసీఆర్ కు జ్వరం పట్టుకుందని బండి  సంజయ్ సెటైర్లు వేశారు.ప్రజలకోసం నిజాయితీగా పనిచేసే నాయకులను మాత్రమే బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నట్టుగా సంజయ్ చెప్పారు.ప్రజలకు, పార్టీకి పనికి రాని నాయకులను తీసుకుని తామేం  చేసుకుంటామన్నారు.

 ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు పెరిగారన్నారు.పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని బండి సంజయ్  హామీ ఇచ్చారు.పార్టీ నేతల  సేవలను ఉపయోగించుకుంటామన్నారు.తెలంగాణకు చేస్తున్న టీఆర్ఎస్ చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేక బూర నర్సయ్య గౌడ్  బీజేపీలో  చేరారని ఆయన చెప్పారు.మోడీ నాయకత్వం లో మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని బూర బీజేపీలో చేరినట్టుగా ఆయన తెలిపారు.

also  read:టీఆర్ఎస్‌కి తెలంగాణ హైకోర్టు షాక్: కారు గుర్తును పోలిన గుర్తులపై గులాబీ పార్టీ పిటిషన్ కొట్టివేత

మునుగోడు  ఉప ఎన్నికల్లో ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి బరిలోకి దిగారు .గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు.

click me!