ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: బండి సంజయ్

By narsimha lode  |  First Published Oct 27, 2022, 12:46 PM IST

ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు  నలుగురు  ఎమ్మెల్యేల  ఫోన్ల డేటాను బయటపెట్టాలని  బీజేపీ కోరింది.బీజేపీ  తెలంగాణ  చీఫ్ బండి సంజయ్ డిమాండ్  చేశారు.


హైదరాబాద్:మునుగోడు: ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామాకు తెరదీశారన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. బీజేపీపై బురదచల్లేందుకు  యత్నించినపోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.. మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  ఫాంహౌస్ సీసీటీవీ పుటేజీతో  పాటు ఈ ఘటనతో ప్రమేయం ఉన్నవారి మొబైల్ డేటాను బయటపెట్టాలని  బీజేపీ తెలంగాణ చీఫ్  బండి సంజయ్ డిమాండ్ చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ గురువారం నాడు టీఆర్ఎస్ పై చార్జీషీట్ ను విడుదల  చేశారు. అనంతరం ఆయన  మీడియాతో  మాట్లాడారు.

ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారని  ఆయన  ప్రశ్నించారు. మీడియా సైతం వాస్తవాలను బయటపెట్టాలని  ఆయన  కోరారు.. దీనివెనుక ఉన్న కుట్రలను చేధించాలని కోరారు. కానీ దురదృష్టవశాత్తు  రెండు, మూడు ఛానెల్స్ పాలకులతో కుమ్కక్కై అబద్దాలను ప్రచారం చేశాయన్నారు.ఇవాళ కాకపోతే   రేపైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని  ఆయన చెప్పారు. అప్పుడు ఆ ఛానళ్ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని  ఆయన కోరారు.. ఎమ్మెల్యేలతో  ఫోన్ సంభాషణలకు సంబంధించి  ఆడియో  టేపులు ఇంకా  తయారు కాలేదా అని  బండి సంజయ్  సెటైర్లు  వేశారు.నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలు  గురిచేశారని   టీఆర్ఎస్  డ్రామాలకు తెరలేపిందన్నారు.  

Latest Videos

ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని  చెప్పిన ఫామ్  హౌస్ టీఆర్ఎస్  ఎమ్మెల్యేదేనన్నారు. ఫామ్ హౌస్ , ఆరోపణలు  ఎదుర్కొంటున్న నందుకు చెందిన హోటల్,ప్రగతి భవన్  సీసీటీవీ పుటేజీని  బయట పెట్టాలని  బండి సంజయ్ డిమాండ్  చేశారు..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ను  ఎవరెవరు కలిశారనే  విషయమై  సీసీటీవీ పుటేజీని బయటపెట్టాలని ఆయన కోరారు.

సైబరాబాద్  సీపీ స్టీఫెన్ రవీంద్ర,  నలుగురు  ఎమ్మెల్యేల  ఫోన్ కాల్స్  డేటాను  బయటపెట్టాలని బండి  సంజయ్  డిమాండ్  చేశారు.స్వామీజీలతో  పాటు సీఎం ల్యాండ్  ఫోన్ల  వివరాలను కూడ  బయటపెట్టాలని  ఆయన  కోరారు.గతంలో  ఓ మంత్రిపై హత్యాయత్నం  కుట్ర అంశం  కూడా  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగిందని  ఆయన గుర్తు చేశారు.ఎఫ్ఐఆర్ నమోదైతే ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదని ఆయన కోరారు.ఎమ్మెల్యేల  స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదో చెప్పాలన్నారు. రేపు యాదాద్రి ఆలయానికి 9 గంటలకు వస్తానని బండి  సంజయ్  చెప్పారు. ఉదయం  పది గంటల వరకు ఆలయం వద్దే ఉంటానన్నారు. రేపు సీఎం  ఆలయం వద్దకు  రాకపోతే  ఈ డ్రామాకు  కేసీఆర్ తెరతీశారని  అర్ధమౌతుందన్నారు.

మునుగోడు అభివృద్దిని దృష్టిలో  ఉంచుకొనే ఏడాది ఎమ్మెల్యేగా  కొనసాగే అవకాశం  ఉన్నా  రాజగోపాల్ రెడ్డి  రాజీనామా  చేశారన్నారు. దుబ్బాక, హుజూరాబాద్  అసెంబ్లీ ఉప  ఎన్నికల  సమయంలో  ఎంతో కొంత అభివృద్ది  పనులకు  కేసీఆర్ సర్కార్  ప్రయత్నించిందన్నారు. మునుగోడు  అభివృద్దిని దృష్టిలో  ఉంచుకొనే  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి  ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా  చేసినట్టుగా చెప్పారు.

also  read:ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: చండూరులో టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలు

రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేయకముందు ,రాజీనామా  ప్రకటన తర్వాత మునుగోడులో అభివృద్ది  కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని బండి  సంజయ్  గుర్తు చేశారు. మునుగోడు  ఉప ఎన్నిక  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనుందన్నారు.రాష్ట్రంలో ఏం  జరుగుతుందనే విషయాన్ని చార్జీషీటులో  పొందుపర్చామన్నారు. రాజగోపాల్   రెడ్డిని గెలిపిస్తే  మునుగోడును అభివృద్ది చేస్తామన్నారు.

click me!