దేవాదాయ మంత్రి సురేఖకు తీవ్ర అనారోగ్యం... మంచంపై పడుకునే వీడియో

By Arun Kumar P  |  First Published Feb 20, 2024, 10:22 AM IST

తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కంగారు పడుతున్న తన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణుల కోసం ఆమె ఓ వీడియోను విడుదల చేసారు. 


హైదరాబాద్ : తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెంగ్యూ బారినపడ్డ ఆమె గత వారం రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. తనకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యులను సంప్రదించానని... వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూగా నిర్దారించారని స్వయంగా కొండా సురేఖ వెల్లడించారు.  అందువల్లే బడ్జెట్ సమావేశాల చివర్లో అసెంబ్లీకి హాజరుకాలేకపోయానని ఆమె తెలిపారు.  

నీరసంగా వున్నా కాస్త ఓపిక తెచ్చుకుని తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా వివరించారు సురేఖ. మంచంపై పడుకునే సెల్ఫీ వీడియో తీసుకుని విడుదల చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నానని... ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని దేవాదాయ మంత్రి తెలిపారు. తన పరిస్థితిని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను... త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని కొండా సురేఖ తెలిపారు. 

Latest Videos

undefined

Also Read  బిఆర్ఎస్ కు వింత పరిస్థితి : వున్నదంతా ఆ పాార్టీ కార్పోరేటర్లే... కానీ మేయర్ పదవి పోయింది...

తీవ్ర జ్వరంతో బాధపడుతూనే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలను కూడా  సురేఖ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. జాతరకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దేవాదాయ అధికారులకు తగు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదికారులను ఆదేశించారు. 

వీడియో

కొండా సురేఖ డెంగ్యూ బారిన పడినట్లు తెలిసి ఆమె అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు కంగారుపడుతున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఆ సమ్మక్క సారలమ్మల దయ తమ నాయకురాలిపై వుండాలని... వనదేవతలే మంచి ఆరోగ్యాన్ని ఆమెకు ప్రసాదించాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. 
 

click me!