ప్రజా గోస- బీజేపీ భరోసా: నేటి నుంచి తెలంగాణలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు..

Published : Feb 10, 2023, 10:57 AM IST
ప్రజా గోస- బీజేపీ భరోసా: నేటి నుంచి తెలంగాణలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు..

సారాంశం

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్‌ మీటింగ్స్‌ను నిర్వహిస్తోంది. ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్‌ మీటింగ్స్‌ను నిర్వహిస్తోంది. ‘‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’’ నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దాదాపు 11,000 శక్తి కేంద్రాల్లో (మూడు బూత్‌ కమిటీలకు ఒకటి చొప్పున) స్ట్రీట్‌కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. ఈ నెల 25 వరకు స్ట్రీట్ కార్నర్ సమావేశాలను కొనసాగించనుంది. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ప్రారంభానికి నియోజకవర్గాల వారీగా హాజరయ్యే జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల జాబితాను గురువారం రాష్ట్ర పార్టీ ప్రకటించింది.

స్ట్రీట్‌కార్నర్‌ సమావేశాలు ద్వారా మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టుగా బీజేపీ నాయకులు తెలిపారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రారంభించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలను స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో వివరించడం జరుగుతుందని చెప్పారు. అలాగే 
ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర వాగ్దానాలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం, అవినీతిని, కుటుంబ పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్ట్రీ కార్నర్ సమావేశాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. 

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి క్రాస్‌రోడ్‌లో జరిగే సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బల్కంపేట్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, శెరిలింగంపల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు పి మురళీధర్ రావు.. బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొననున్నారు. 

ఇక, సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్, మహబూబ్ నగర్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రాంచందర్‌రావు, మంచిర్యాలలో మాజీ ఎంపి వివేక్‌ వెంకటస్వామి, దుబ్బాకలో మాజీ ఎంపీ విజయశాంతి, వికారాబాద్‌లో సీనియర్‌ నేత గూడూరు నారాయణరెడ్డి, ఆందోల్‌లో గీతామూర్తి, మేడ్చల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొననున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్