కవిత తీరుతో మహిళలు తలదించుకొనే పరిస్థితి: బండి సంజయ్

By narsimha lode  |  First Published Mar 10, 2023, 1:50 PM IST

మహిళా రిజర్వేషన్ విషయమై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చెప్పారు.  
 


హైదరాబాద్:ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమదేవిగా  కవిత తనను తాను ఊహించుకుంటోందని   బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ విమర్శించారు.రాష్ట్రంలో  మహిళలపై దాడులలను నిర్వహిస్తూ  శుక్రవారంనాడు బీజేపీ దీక్షకు దిగింది.  ఈ దీక్షలో  బండి సంజయ్  పాల్గొన్నారు.

మహిళా రిజర్వేషన్ పై  ఢిల్లీలో  కాకుండా  ప్రగతి భవన్ ముందు  ధర్నా చేయాలని కవితకు సూచించారు  బండి సంజయ్. మహిళలకు  33శాతం బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వనందుకు కేసీఆర్ ను కవిత ప్రశ్నించాలని  బండి సంజయ్  కోరారు.  కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ మహిళలకు  33శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదో  చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

Latest Videos

కేసీఆర్ బిడ్డ కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.  తన దందా ద్వారా సంపాదించిన డబ్బును కవిత పేద మహిళలకు  ఇవ్వాలని  బండి సంజయ్ డిమాండ్  చేశారు.  తన కేబినెట్ లో  33 శాతం  మహిళా మంత్రులు ఎందుకు లేరో  చెప్పాలని ఆయన కేసీఆర్ ను కోరారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారన్నారు. కేసీఆర్ హాయాంలో మహిళా సర్పంచ్ కే రక్షణ లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు మహిళలపై  అత్యాచారాలు, దాడులు  చేస్తున్నారని  ఆయన  ఆరోపించారు.

also read:కవిత దీక్ష చాలా హాస్యాస్పదం.. పోరాటం ఢిల్లీలో కాదు, కేసీఆర్ ఇంటిముందు చేయాలి.. కవితపై షర్మిల ఫైర్

మహిళల రిజర్వేషన్ల  గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతకానితనం వలనే తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు.  
మహిళల పట్ల‌ సీఎం కేసీఆర్ కోపం, కసితో వ్యవహరిస్తున్నారన్నారు. 

రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్

కవితకు ఈడీ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి  ఎందుకు మాట్లాడటం లేదని  బండి సంజయ్  ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని  రుజువైందన్నారు. లిక్కర్ స్కాంలో సంబంధం ఉందా? లేదా? సీఎం, పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేయాలన్నారు. కవిత లిక్కర్ స్కాంకు, తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటి? అని  ఆయన ప్రశ్నించారు. 

తెలంగాణ సమాజానికి చెప్పి కవిత లిక్కర్ దందా చేసిందా? అని ఆయన అడిగారు.  ఉద్యమకారుల గురించి పట్టించుకోని కేసీఆర్ తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నాడని ఆయన  ఎద్దేవా చేశారు. అవినీతిపరులు ఎవరైనా మోడీ సర్కార్ వదిలే ప్రసక్తే లేదన్నారు.

 


 

click me!