బీఆర్ఎస్ మోడ‌ల్ అంటే కుంటుంబ పాల‌న‌.. గుజ‌రాత్ మోడల్ తో క్రోనీ క్యాపిటలిస్టులకు ల‌బ్ది.. : కాంగ్రెస్

By Mahesh Rajamoni  |  First Published Mar 10, 2023, 1:19 PM IST

Hyderabad: బీఆర్ఎస్ మోడ‌ల్ అంటే కుంటుంబ పాల‌న అనీ, గుజ‌రాత్ మోడల్ తో క్రోనీ క్యాపిటలిస్టులకు ల‌బ్ది చేకూర్చ‌డ‌మేన‌ని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ, బీఆర్ఎస్ ల‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని పేర్కొంది. అయితే, కాంగ్రెస్ మాత్రం పేద‌ల సాధికార‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంద‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ బ‌ఘేల్ తెలిపారు.


Congress criticizes BRS and BJP:  బీజేపీ, బీఆర్ఎస్ ల‌పై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డింది. బీఆర్ఎస్ మోడ‌ల్ అంటే కుంటుంబ పాల‌న అనీ, గుజ‌రాత్ మోడల్ తో క్రోనీ క్యాపిటలిస్టులకు ల‌బ్ది చేకూర్చ‌డ‌మేన‌ని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ, బీఆర్ఎస్ ల‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని పేర్కొంది. అయితే, కాంగ్రెస్ మాత్రం పేద‌ల సాధికార‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంద‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ బ‌ఘేల్ తెలిపారు. 

టీపీసీసీ అధ్యక్షుడు,  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్రలో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భూపేష్ బ‌ఘేల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. క్రోనీ క్యాపిటలిస్టులకు లబ్ధి చేకూర్చే బీజేపీ 'గుజరాత్ మోడల్', తెలంగాణలో 'కుటుంబ పాలన' అనే బీఆర్ఎస్ మోడల్ కు భిన్నంగా పేదల సాధికారత కోసం కాంగ్రెస్ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సి ఉండగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో పదవులు దక్కాయన్నారు.

Latest Videos

 "మీరు (ప్రజలు) తెలంగాణ ( రాష్ట్రం) అడిగారు, మీకు తెలంగాణ వచ్చింది. కానీ రైతులకు (వారి ఉత్పత్తులకు) క‌నీస మ‌ద్ద‌తు ధర లభించిందా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగం పోయిందా?.." అని ఆయ‌న ప్రశ్నించారు. "ఒక్క కుటుంబం మాత్రమే నిరుద్యోగం నుంచి బయటపడింది.. అదే కేసీఆర్ కుటుంబం. ఎవరీ కే తారకరామారావు (కేసీఆర్ కొడుకు) ఆయనకు కూడా ఉద్యోగం వచ్చింది. హరీష్ రావు (కేసీఆర్ మేనల్లుడు) ఎవరు? అతనికి ఉపాధి కూడా లభించింది. కవిత (కేసీఆర్ కూతురు) ఎవరు? అంటే ఒకే కుటుంబానికి ఉపాధి లభించింది. ఆయన తన కుటుంబానికి అన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ" కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

బీజేపీని టార్గెట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొంతమంది మిత్రులకు లబ్ధి చేకూర్చారని పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ, దీనిని 'గుజరాత్ మోడల్'గా బఘేల్ అభివర్ణించారు. తెలంగాణ మోడల్ ఒక కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని ఆరోపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ మోడల్ ను దేశంలో అమలు చేస్తామని మోడీ చెప్పారని గుర్తు చేస్తూ.. గుజరాత్ మోడల్ వల్ల మీరు లబ్ది పొందారా?  అని ప్రశ్నించారు. మోడీ ఆయ‌న సన్నిహితుల‌కు ల‌బ్ది చేకూర్చే విధంగా పాల‌న సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అయితే, కాంగ్రెస్ పేద‌ల‌ను ఎప్పుడూ విస్మ‌రించ‌లేద‌నీ, సామాన్యులను బలోపేతం చేస్తుందనీ, పేదల సాధికారత కోసం కృషి చేయ‌డంలో  కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుంద‌ని తెలిపారు. 

కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వం విద్యాహక్కు, ఆహారపు హక్కు, పనిచేసే హక్కు, సమాచార హక్కు కల్పించిన ఉదాహరణలను ఆయన ఉదహరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేసే 'ఛత్తీస్ గఢ్ మోడల్'పై బఘేల్ మాట్లాడారు. రైతులతో సహా అక్కడ ప్రారంభించిన అనేక పథకాలను కూడా ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్ లో నిరుద్యోగ భృతిని ప్రకటించిందన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాలను కాంగ్రెస్ మాత్రమే నెరవేర్చగలదనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఆదరించాలని ఆయన అన్నారు. 
 

click me!