KTR: విద్వేషం నింపుతున్న బీజేపీ దేశ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

Published : Jun 06, 2022, 01:05 PM IST
KTR: విద్వేషం నింపుతున్న బీజేపీ దేశ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

సారాంశం

BJP-KTR: బీజేపీ నాయ‌కుల విద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్వేషం నింపుతున్న బీజేపీ దేశ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని అన్నారు.   

Telangana: తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్‌) మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. బీజేపీ నాయ‌కుల విద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్వేషం నింపుతున్న బీజేపీ దేశ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రవక్త మహమ్మద్‌పై ఇప్పుడు బహిష్కరణకు గురైన మరియు సస్పెండ్ చేయబడిన బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాలు ఆదివారం డిమాండ్ చేశాయి. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నేత‌లు, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. 

ఈ క్ర‌మంలోనే దౌత్య‌ప‌ర‌మైన వివాదం నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ప‌లు సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. "బీజేపీ మతోన్మాదుల ద్వేషపూరిత ప్రసంగాలకు ఒక దేశంగా భారతదేశం అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.. ఒక దేశంగా భారతదేశం కాదు" అని అన్నారు. "నిత్యం విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నందుకు మీ పార్టీ (బీజేపీ) ముందుగా దేశంలోని ప్ర‌జ‌ల‌కు, భారతీయులకు క్షమాపణ చెప్పాలి" అని ఆయన ట్వీట్ చేశారు.

 

బీజేపీ తెలంగాణ చీఫ్‌ను సస్పెండ్ చేయండి: కేటీఆర్

ఆదివారం నాడు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఆ పార్టీ నాయ‌కుడు నవీన్ కుమార్ జిందాల్ వారి మతాన్ని కించపరిచే వ్యాఖ్యలపై సస్పెండ్  చేసింది. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. "బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంటే, అన్ని మసీదులను తవ్వి ఉర్దూపై నిషేధం విధించాలని బహిరంగ ప్రకటన చేసిన తెలంగాణ బిజెపి చీఫ్‌ను కూడా మీరు సస్పెండ్ ఎందుకు చేయలేదు?" అని  ట్వీట్ చేశారు. “ఎందుకు ఈ ఎంపిక చికిత్స న‌డ్డా జీ? ఏమైనా క్లారిటీ ఉందా?’’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేటీఆర్ ప్రశ్నించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?