బలపడుతున్నామనే దాడులు: రాజాసింగ్ కు బీజేపీ అధక్షుడు లక్ష్మణ్ పరామర్శ

By Nagaraju penumalaFirst Published Jun 20, 2019, 12:37 PM IST
Highlights

రాజాసింగ్ తలకు తగిలిన గాయంపై ఆరా తీశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే టీఆర్ఎస్ పార్టీ పోలీసులతో కలిసి తమపై దాడులకు పురికొల్పుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. 

హైదరాబాద్: జుమ్మెరాత్ బజార్ వద్ద జరిగిన ఉద్రిక్తతలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తోపాటు ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శించారు. 

రాజాసింగ్ తలకు తగిలిన గాయంపై ఆరా తీశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే టీఆర్ఎస్ పార్టీ పోలీసులతో కలిసి తమపై దాడులకు పురికొల్పుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. 

జుమ్మెరాత్ బజార్ ఘటనలో తమ శాసన సభ్యుడిపై జరిగిన దాడిని పోలీసులు, ప్రభుత్వం చేసిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
స్వాతంత్ర సమరయోధురాలు రాణి అవంతిభాయ్ విగ్రహాన్ని అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నామని అది ధ్వంసమవ్వడంతో కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని అందులో తపపేంటో చెప్పాలని నిలదీశారు.  

విగ్రహం తీసుకు వస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకొని లాఠీ ఛార్జ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై రోజురోజుకు దాడులు ఎక్కువ అవుతున్నాయంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలపై దాడులను తాము ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడి కేసులో ట్విస్ట్: వీడియో విడుదల

పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫోటోలు)

జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల లాఠీచార్జ్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

click me!