కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆ సీఎం ఎందుకు: సీఎల్పీనేత భట్టి విక్రమార్క

By Nagaraju penumalaFirst Published Jun 20, 2019, 11:28 AM IST
Highlights

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని ఫడ్నవీస్ ను పిలుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడంపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్ తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ పై దృష్టి మల్లించినట్లైంది. 

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఓ వేడుకలా నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని ఫడ్నవీస్ ను పిలుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడంపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్ తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ పై దృష్టి మల్లించినట్లైంది. 

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అంతా అవినీతిమయమని ఆరోపించారు మల్లు భట్టివిక్రమార్క. 15 శాతం నిర్మాణానికే రూ.50 వేల కోట్లు ఖర్చయితే.. మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. 

 

click me!