ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు: ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్న అధిష్టానం

By narsimha lode  |  First Published Feb 29, 2024, 10:01 AM IST

బీజేపీ తెలంగాణ నేతలు  హస్తినబాట పట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను  ఆ పార్టీ ఖరారు చేయనుంది.


హైదరాబాద్:భారతీయ జనతా పార్టీకి చెందిన  తెలంగాణ నేతలు గురువారం నాడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం  బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇవాళ సమావేశం కానుంది.ఈ సమావేశంలో సుమారు  100 మంది ఎంపీ అభ్యర్థులను బీజేపీ పార్లమెంటరీ బోర్డు  ఖరారు చేసే అవకాశం ఉంది.ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి  సుమారు  10 మంది అభ్యర్థులకు చోటు దక్కే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టింది.  దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ దఫా ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని  భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకొంది.  ఈ దఫా  కనీసం రెండంకెల స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.

Latest Videos

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుంది.  అయితే  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ  నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది  అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పదికిపైగా  ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంపై  బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ  వ్యూహారచన చేస్తుంది.అయితే పార్లమెంట్ ఎన్నికలపై  ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవడంపైనే గత కొన్ని రోజులుగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుండి  విజయ సంకల్ప యాత్రలను బీజేపీ నాయకత్వం ప్రారంభించింది. ఈ యాత్రల ముగింపును పురస్కరించుకొని ఈ ఏడాది మార్చి  4, 5 తేదీల్లో  రాష్ట్రంలో నిర్వహించే బీజేపీ సభల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే.

 

click me!