Dairymilk Chocolate ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుడ్ ల్యాబరేటరీలో బయటపడ్డ గగుర్పొడిచే నిజాలు.. 

By Rajesh KarampooriFirst Published Feb 29, 2024, 6:41 AM IST
Highlights

Dairymilk Chocolate ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించారు..

Dairymilk Chocolate: చాక్లెట్స్.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందులోనూ క్యాడ్ బరీ (Dairymilk Chocolate) డైరీమిల్క్ చాక్లెట్స్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. నిజంగా ఆ పేరు చెప్పగానే నోరు ఊవ్విళ్లూరుతోంది కదా.. కానీ, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను చూస్తుంటే.. ఎంతో అమితంగా తిన్న ఈ చాక్లెట్స్ ను దూరం పెట్టాల్సివస్తుంది. అంతేకంటే ఎక్కవగా తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలేం జరిగింది ? ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారని అనుకుంటున్నారా?  

క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ గురించి తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ సంచలన నిజాలను వెల్లడించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని నిర్దారించింది. ఆ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్నప్తి చేసింది. అయితే..  క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. 

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి తన పిల్లల కోసం అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోని ఓ షాప్‌లో చాక్లెట్ కొన్నాడు. రాపర్ ఓపెన్ చేసి తీరా తిందామనుకునే సరికి అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో షాక్ గురైన ఆ వ్యక్తి  వెంటనే మొబైల్ ఫోన్ తీసి వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ చాక్లెట్స్  శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వార్మ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించారు. 

click me!