సీబీఐ కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ సుజనా చౌదరి

By telugu teamFirst Published Jun 30, 2021, 8:34 AM IST
Highlights

అమెరికా వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని, అందుకు ఆమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టుకు తెలిపారు.

హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనా చౌదరిపై 2019లో సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది. 

ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగే ఓ సదస్ుకు హాజరు కావాలని తనకు ఆహ్వానం అందిందని, ఆ సదస్సుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ మీద అత్యవసరంగా విచారణ జరపాలని కూడా ఆయన కోరారు. 

ఆహ్వానానికి సంబంధించిన వివరాలను సమర్పించలేదని, అందువల్ల అత్యవసరంగా విచారణ చేపట్టలేదని హైకోర్టు తెలుపుతూ విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది. సుజనా చౌదరి డైరెక్టర్ గా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ బ్యాంకులను మోసం చేసిందనే సిబిఐ కేసులో హైకోర్టు విచారణను ముగించింది. 

గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ మరోసారి మంగళవారంనాడు విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుజనా చౌదరిని విచారించామని, అవసరమైతే మల్లీ పిలుస్తామని సిబిఐ తెలిపింది. 

విచారణ పేరుతో పదే పదే పిలిచే అవకాశం ఉందని సుజనా చౌదరి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు పిలువాలని అనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. సిబిఐ నోటీసులు ఇస్తే, వాటిపై అభ్యంతరాలుంటే మళ్లీ పిటీషన్ దాఖలు చేసుకోవచ్చునని సుజనా చౌదరికి సూచించింది. దాంతో విచారణను ముగించింది.

click me!