భూముల విలువ పెంచేందుకే ఎయిర్ పోర్టు మెట్రో.. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

By Sumanth KanukulaFirst Published Dec 18, 2022, 1:34 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్‌ అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్‌ అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. లక్ష్మణ్ ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప.. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా అని అన్నారు. ప్రజలను పక్కదారి  పట్టించేందుకు మాత్రమే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. 

కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని, ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇచ్చిన నిధులతో ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదని అన్నారు. తద్వారా పేద ప్రజలను కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 

కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతుందని లక్ష్మణ్ ఆరోపించారు.పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. భూముల విలువ పెంచేందుకే ఎయిర్ పోర్టు మెట్రో చేపట్టారని లక్ష్మణ్ ఆరోపించారు. 

click me!