అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

Published : Jan 03, 2020, 03:22 PM ISTUpdated : Jan 03, 2020, 09:41 PM IST
అసద్‌ను  నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

సారాంశం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని క్రేన్ కు వేలాడదీస్తానని చెప్పారు. 


నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీపీై సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీని నిజామాబాద్‌లో క్రేన్ కు వేలాడదీస్తానని చెప్పారు.అసద్‌ గడ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తానని చెప్పారు. నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకు  అప్పగించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని అరవింద్ ఆరోపించారు.

కేసీఆర్ ముళ్లరూపంలో ఉన్న ముఖ్యమంత్రి అంటూ అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  మజ్లిస్ కు తొత్తుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అరవింద్ విమర్శలు గుప్పించారు.ఆరేళ్లుగా దేశంలో మంచి పనుులు జరుగుతున్నాయని ధర్మపురి అరవింద్ చెప్పారు. గతంలో దేశంలో ఇటాలియన్ మాఫియా రాజ్యం నడిచిందన్నారు. 

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్  నుండి జరిగిన బీజేపీ అభ్యర్ధిగా అరవింద్ పోటీ చేసి విజయం సాధించాడు. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కవితపై ఆయన విజయం సాధించారు.

నిజామాబాద్‌లో అరవింద్ విజయం సాధించడం సంచలనం. అయితే కరీంనగర్‌తో పాటు, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ బీజేపీకి  ఓటు చేసినట్టుగా టీఆర్ఎస్ స్థానిక నాయకత్వం అప్పట్లోనే పార్టీ చీఫ్ కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడ అరవింద్  పోటీ పడుతున్నాడు.  ఈ తరుణంలో అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌