చిన్న అనుమానం... మొత్తం కుటుంబం బలి

By telugu teamFirst Published Jan 3, 2020, 11:57 AM IST
Highlights

పెళ్లైన నాటి నుంచే భార్యను జయన్న అనుమానంతో వేధించేవాడు. ఈ మద్య దీనికి మద్యం తోడవ్వడంతో మరింత వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఇటీవల వరలక్ష్మి.. పుట్టింటికి వెళ్లింది. ఇరువైపుల పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో... తిరిగి మళ్లీ భర్త వద్దకు వచ్చింది.


భార్య భర్తల బంధంలో ముందుగా ఉండాల్సింది నమ్మకమే. ఆ నమ్మకం లేనిచోట ఎంత ప్రయత్నించినా బంధం నిలపడదు. దంపతుల మధ్య అనుమానం అనే జబ్బు అస్సలు రాకూడదు.  ఒక్కసారి వస్తే... ఆ జబ్బు వదలదు. దానికి మందు కూడా ఉండదు. ఇలాంటి జబ్బు ఓ భర్తకి వచ్చింది. భార్యపై అనవసరంగా అనుమానం పెంచుకున్నాడు. అతని అనుమానమే... అతనితోపాటు కుటుంమొత్తాన్ని దహనం చేసింది. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా అయ్యవారిపల్లికి చెందిన జయన్న, వరలక్ష్మి దంపతులకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది.  వారికి ఇద్దరు సంతానం. కుమారుడు సృజన్(19), కుమార్తె గాయత్రి(17). జయన్న గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ సమయంలో మద్యానికి బానిసగా మారాడు. ఆ మత్తులో చేస్తున్న పని మానేసి ఖాళీగా తిరుగుతుండేవాడు.

అయితే... పెళ్లైన నాటి నుంచే భార్యను జయన్న అనుమానంతో వేధించేవాడు. ఈ మద్య దీనికి మద్యం తోడవ్వడంతో మరింత వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఇటీవల వరలక్ష్మి.. పుట్టింటికి వెళ్లింది. ఇరువైపుల పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో... తిరిగి మళ్లీ భర్త వద్దకు వచ్చింది.

మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఇలా గొడవ జరిగిన ప్రతిసారి తనకు కాకుండా తన కుమార్తె తల్లికి మద్దతు ఇవ్వడం పట్ల అతనికి కూతురుపై కూడా కోపంగా ఉండేది. ఈ క్రమంలో భార్య, కూతురిని చంపేద్దామని అనుకున్నాడు. రాత్రి నిద్రపోతున్న భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో అతని ఒంటికి కూడా నిప్పు అంటుకుంది.

ఈ ఘటనలో జయన్న, గాయత్రి అక్కడికక్కడే మృతి చెందగా.. వరలక్ష్మి మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు కేుసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!