హిందూ దేవుళ్లపై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్తిస్తున్నారా?.. రాజాసింగ్ ఘాటు ప్రశ్న...

Published : Dec 25, 2021, 11:45 AM IST
హిందూ దేవుళ్లపై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్తిస్తున్నారా?.. రాజాసింగ్ ఘాటు ప్రశ్న...

సారాంశం

సీఎం కేసీఆర్ హిందూ దేవాలయాలను నిర్మిస్తారని.. అలాగే పూజిస్తారన్నారు. ఒక్కసారి ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించే ముందు కేటీజఆర్ తన తండ్రి కేసీఆర్ ముఖమైనా చూడాల్సిందన్నారు. మునావర్ ఫారూఖీ హిందువుల దేవుళ్లపై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్తిస్తున్నారా? అంటూ రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించారు. 

హైదరాబాద్ : మంత్రి KTR కు బీజేపీ ఎమ్మెల్యే Rajasingh హెచ్చరిక జారీ చేశారు. స్టాండ అప్ కమెడియన్ Munawar Farooqiని తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మునావర్ ఫారూఖీని 16 రాష్ట్రాలు వెలివేశాయని.. ఆయనను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు ఆహ్వానించడాన్ని ఖండిస్తున్నానన్నారు. హైదరాబాద్ వేదికగా జనవరి 9న జరగబోయే ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని రాజాసింగ్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ హిందూ దేవాలయాలను నిర్మిస్తారని.. అలాగే పూజిస్తారన్నారు. ఒక్కసారి ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించే ముందు కేటీజఆర్ తన తండ్రి కేసీఆర్ ముఖమైనా చూడాల్సిందన్నారు. మునావర్ ఫారూఖీ హిందువుల దేవుళ్లపై కామెడీ చేయడాన్ని కేటీఆర్ సమర్తిస్తున్నారా? అంటూ రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా, బీజేపీ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ శుక్రవారం ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కేటీఆర్ మండిపడ్డారు. 

కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. అలాంటి వాటిని ఖండించాల్సిందేనని పోస్ట్..

‘‘ అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? himanshu శరీరంలోనా..? అంటూ ’’ teenmar mallanna పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు jp nadda ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రధానమంత్రి narendra modi, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా అర్థంలేని విషయాలను ప్రచారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

కాగా, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  మంత్రి కేటీఆర్‌ ట్వీట్ కు మద్దతుగా నిలిచారు. ‘ఒక తల్లిగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా.. పిల్లలను వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటి ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను’ అని వైఎస్ షర్మిల శనివారం ట్వీట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
Hyderabad Weather : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్