కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. అలాంటి వాటిని ఖండించాల్సిందేనని పోస్ట్..

By Sumanth KanukulaFirst Published Dec 25, 2021, 10:28 AM IST
Highlights

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  (YS Sharmila).. మంత్రి కేటీఆర్‌కు (Teenmar Mallanna) మద్దతుగా నిలిచారు. అయితే ఇది రాజకీయ పరమైన విషయంలో మాత్రం కాదు.కుటుంబ సభ్యుల‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించాల్సిందేనని అన్నారు. 

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  (YS Sharmila).. మంత్రి కేటీఆర్‌కు (Teenmar Mallanna) మద్దతుగా నిలిచారు. అయితే ఇది రాజకీయ పరమైన విషయంలో మాత్రం కాదు. తన కుమారుడు హిమాన్షు‌ Himanshu)  కించపరిచేలా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే పిల్లలను వేధించడం, బాడీ షేమ్ చేయడం వంటి వాటిని తాను ఖండిస్తున్నట్టుగా  వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 

‘ఒక తల్లిగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా.. పిల్లలను వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటి ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. 

‘‘ అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు (himanshu ) శరీరంలోనా..? అంటూ ’’ తీన్మార్‌ మల్లన్న (teenmar mallanna) పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్‌ షా (amit shah) కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా అర్థంలేని విషయాలను ప్రచారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

 

As a mother I detest bullying kids&as a leader of a political party,I condemn such derogatory statements on the family members.Whether it is belittling women or bodyshaming kids, we must come together to call out such statements irrespective of our political affiliations https://t.co/6L16jNYtcL

— YS Sharmila (@realyssharmila)

మరోవైపు తీన్మార్ మల్లన్న పోస్టుపై టీఆర్‌ఎస్ మద్దతురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్న దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

click me!