పవన్... మతం మార్చకున్నావా.. రాజాసింగ్ వార్నింగ్

Published : Dec 03, 2019, 10:45 AM ISTUpdated : Dec 03, 2019, 10:47 AM IST
పవన్... మతం మార్చకున్నావా.. రాజాసింగ్ వార్నింగ్

సారాంశం

హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవుపలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్  హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రాజాసింగ్ మండిపడ్డాడు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు. 

హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవుపలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబర్దార్ పవన్‌ అని హెచ్చరించారు.

AlsoRead మారితే గౌరవిస్తా.. లేదంటే జగన్ రెడ్డి అనే పిలుస్తా: తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్...

కాగా... ఇటీవల జనసేనాని పవన్ తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. 

హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. హిందూ మతం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పైవిధంగా మాట్లాడారు. 

PREV
click me!

Recommended Stories

పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్