
ఇటీవల హైదరాబాద్ నగరంలో మృగాళ్ల బారిన పడి వెటర్నరీ డాక్టర్ దిశ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె హత్యోదంతం దేశాన్ని విణికించేసింది. 8ఏళ్ల క్రితం నిర్భయ ఘటన ప్రజలను ఎంతగా భయపెట్టింతో... తిరిగి మళ్లీ దిశ ఘటన భయకంపితులను చేసింది.
ఆడపిల్ల భయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా... దిశ అస్థికలను ఆమె తండ్రి జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. సోమవారం కుటుంబసభ్యులు, దిశ స్నేహితులతో కలిసి బీచుపల్లికి చేరుకున్న తండ్రి దిశకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు.
AlsoRead జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే...
ఇదిలా ఉంటే... దిశ.. చాలా సున్నిత మనస్కురాలని ఆమె చిన్ననాటి స్కూల్ డైరెక్టర్ తెలిపారు. దిశ చిన్నతనంలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హసన్ పర్తి మండలంలోని ఎర్రగట్టు సమీపంలో ఉన్న గ్రీన్ వుడ్ పాఠశాలలో చదువుకుంది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ హాస్టల్ లో ఉండి చదువుకునేది.
పదో తరగతి లో 536 మార్కులు సాధించింది. ఎదుటివారికి సహాయం చేయడంలో కూడా దిశ ముందు ఉండేది. ఆమెకు మోస్ట్ హఎల్పింగ్ స్టూడెంట్ పురస్కారం కూడా అందిందని ఆమె చదవిన స్కూల్ డైరెక్టర్ భరద్వాజనాయుడు చెప్పారు.
AlsoReadJustice for Disha: దిశ నిందితులకు పది రోజుల కస్టడీ...
ఇదిలా ఉండగా..దిశ కేసులో నిందితులను పది రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో సమగ్ర దర్యాప్తు కోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వ్యవహారాన్ని పోలీసులు, కోర్టు అధికారులు అత్యంత గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో కస్టడీ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
కోర్టు సమయం ముగిసిన తర్వాతే ఆదేశాలు రావడం గమనార్హం. పది రోజుల కస్టడీ సమయంలో పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు చార్జీషీటుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు.
జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పది రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పలు విషయాలను ప్రస్తావించారు
నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో వేలాది మంది పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఈ కేసు విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేయలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయమై సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు, యువత కోరుతున్నారు.