కేటీఆర్... నీ తండ్రి కేసీఆర్ ని అడిగి తెలుసుకో...: రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్

Arun Kumar P   | Asianet News
Published : Oct 24, 2021, 02:01 PM IST
కేటీఆర్... నీ తండ్రి కేసీఆర్ ని అడిగి తెలుసుకో...: రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

హైదరాబాద్ రోడ్ల గురించి ప్రశ్నించేముందు పెరుగుతున్న పెట్రోల్,డిజిల్ ధరల గురించి తెలుసుకోండంటూ కేటీఆర్  కౌంటరివ్వగా... అదే స్థాయిలో రివర్స్ కౌంటరిచ్చారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. 

హైదరాబాద్:  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్ని పాడయిపోయాయని... తనతో కలిసి బులెట్ బండిపై ఆ రోడ్లను పరిశీలించడానికి సిద్దమా అని రాజాసింగ్ గతంలో ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై తాజాగా కేటీఆర్ స్పందించారు. 

''రోజురోజుకు మరింత ఎక్కువవుతున్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఏమనుకుంటున్నారో ఎందుకు తెలుసుకోరు? అలాగే సామాన్య గృహిణులను ఆపి ఎల్పిజి సిలిండర్ ధరల పెంపు గురించి అడగండి. జిడిపి పెంపు అంటే గ్యాస్, డిజిల్, పెట్రోల్ ధరలు పెంచడమేనా అంటున్నారని మీరు వినే వుంటారు? ఇప్పటికైనా మీ తీరు మార్పుకుని మంచిచేస ప్రజల మనసు దోచుకోండి'' అంటూ raja singh కు KTR సమాధానమిచ్చారు. 

అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై రాజాసింగ్ కూడా స్పందించారు. పెట్రోల్, డిజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయో మీకు అవగాహన లేదా కేటీఆర్? లేకుంటే UPA హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మీ తండ్రి KCR ని అడిగి తెలుసుకోమంటూ కేటీఆర్ కు రాజాసింగ్ రివర్స్ కౌంటరిచ్చారు. 

READ MORE  బిజెపి రాజాసింగ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటు రిప్లై

తాను వర్షాలతో పాడపోయిన వాహనాదారులకు నరకం చూపిస్తున్న goshamahal, old city రోడ్ల దుస్థితి గురించి ప్రస్తావిస్తే దాన్ని దాటవేస్తూ కేటీఆర్ మరో అంశం గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. తన ట్వీట్ కు ఇప్పటికయినా స్పందించినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు అంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేసారు.

ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్న నేపథ్యంలో.. ముందు ఆ విషయాలను తెలుసుకోండంటూ కేటీఆర్ కౌంటరివ్వగా... పెట్రోల్, డిజిల్ ధరల పెంపుకు గల కారణాలు కేంద్రమంత్రిగా పనిచేసిన నీ తండ్రిని అడుగు అంటూ రాజాసింగ్ రివర్స్ కౌంటరిచ్చారు. 


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు