సిద్దిపేటలో నగదు కేసు: హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వాష్ పిటిషన్

Published : Nov 12, 2020, 05:00 PM IST
సిద్దిపేటలో నగదు కేసు: హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వాష్ పిటిషన్

సారాంశం

 సిద్దిపేటలో నోట్ల కట్టలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.సిద్దిపేట పోలిస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.  


హైదరాబాద్: సిద్దిపేటలో నోట్ల కట్టలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.సిద్దిపేట పోలిస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు.

రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని ఆయన సూచించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.

also read:ఆ డబ్బులతో నాకేం సంబంధం: రఘునందన్ రావు

ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన సిద్దిపేటలో రఘునందన్ రావు సన్నిహితుడు అంజన్ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు గుర్తించినట్టుగా  పోలీసులు కేసు నమోదు చేశారు.
తన బంధువుల ఇళ్లలో రూ. 18.67 లక్షలు దొరికాయని పోలీసులు కట్టుకథలు అల్లారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తీసుకొచ్చారని  పోలీసులు ఆరోపించారు. 

పోలీసులు సీజ్ చేసిన నగదులో రూ. 12.80 లక్షలను పోలీసుల నుండి బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారు.. ఈ నగదును తీసుకెళ్లని బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్