దుబ్బాక బైపోల్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీపై టీఆర్ఎస్ జాగ్రత్తలు

By narsimha lodeFirst Published Nov 12, 2020, 4:28 PM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  దుబ్బాక తప్పిదం చోటు చేసుకోకుండా ఉండేందుకు టీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది


హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  దుబ్బాక తప్పిదం చోటు చేసుకోకుండా ఉండేందుకు టీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చింది. లక్ష మెజారిటీతో విజయం సాధిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ కు దుబ్బాక ఓటర్లు షాకిచ్చారు.

దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకొంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలని బీజేపీ కూడ ప్లాన్ చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు  బీజేపీలో ఉత్సాహన్ని నింపాయి.

also read:డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు?: రాజకీయపార్టీలతో ఎస్ఈసీ భేటీ

జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమౌతున్నారు.ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై కేటీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్  99 డివిజన్లను కైవసం చేసుకొంది. కానీ ఈ దఫా  130 డివిజన్లను గెలుచుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకొంది. హైద్రాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

మంగళవారం నాడు నగరానికి చెందిన కొందరు పార్టీ ముఖ్యలతో కేటీఆర్ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు.అక్టోబర్ మాసంలో నగరంలో కురిసిన భారీ వర్షాలతో టీఆర్ఎస్ కు నష్టమనే అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి. అయితే వరద బాధితులకు రూ. 10 వేల పరిహారం చెల్లింపు తమకు కలిసివస్తోందని అధికార టీఆర్ఎస్ ఆశతో ఉంది.

అయితే వరద బాధితులకు పరిహారం పంపిణీలో అధికార పార్టీ నేతలకు చెందిన క్షేత్రస్థాయి క్యాడర్ చేతివాటం చూపుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా ఈ విషయాన్ని ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహాంపై టీఆర్ఎస్ కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ గురువారం నాడు సమావేశం నిర్వహించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.

click me!