గిరిజనుల గురించి ఆలోచించేది బీజేపీయే.. ద్రౌపది ముర్ము ఎంపికపై ఈటల రాజేందర్ స్పందన

By Siva KodatiFirst Published Jun 22, 2022, 5:24 PM IST
Highlights

ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోడీ నిర్ణయించారని ప్రశంసించారు. 

రాష్ట్రపతి ఎన్నికలపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే (bjp) ఈటల రాజేందర్ (Etela rajender) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డను అత్యున్నత స్థానంలో (presidential election 2022) నిలబెట్టిందన్నారు. రెండవ సారి రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన బిడ్డను ఎంపిక చేసిందని (draupadi murmu) ఈటల వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు గిరిజనుల గురించి ఎవరు ఆలోచించలేదని రాజేందర్ అన్నారు. అలాంటి గిరిజనులను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అట్టడుగున ఉన్న వర్గాలు కూడా రాజ్యాధికారంలోకి రావాలి అని బీజేపీ లక్ష్యమని ఈటల పేర్కొన్నారు. 

అధికారంలోకి వస్తేనే ఆ వర్గాలు బాగుపడతాయని ఆలోచించిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) అని రాజేందర్ ప్రశంసించారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కూడా 50 శాతం పైగా OBC  మంత్రులు ఉన్నారని ఈటల గుర్తుచేశారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన పార్టీ బీజేపీ అని.. అనేక రాష్ట్రాల్లో ఓబిసిలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం కూడా నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఉందని ఆయన వెల్లడించారు. 

Also ReadPresidential Election: బీజేపీ ట్రంప్‌ కార్డుగా ద్రౌపది ముర్ము..! ఆ పార్టీలు ఇరుకునపడినట్టేనా..?

మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీలో (basara iiit) పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారని రాజేందర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడి ఉండటమే అందుకు ఉదాహరణ అని రాజేందర్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నప్పటికీ సికింద్రాబాద్ రైల్వే ఘటన ఎందుకు జరిగింది? ఈ ఘటనలో ఎందుకు ఫెయిలయ్యారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు.

click me!