Latest Videos

తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈటల రాజేందర్

By Siva KodatiFirst Published Sep 3, 2023, 9:01 PM IST
Highlights

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం వీణవంక పర్యటనకు వెళ్లి వస్తుండగా.. ఈటల కారు, కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. గొర్రెలు అడ్డు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఈటల మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!