ఎల్‌బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసు .. ఉస్మానియాకు సంఘవి, పోస్ట్‌మార్టానికి చింటూ మృతదేహం

By Siva Kodati  |  First Published Sep 3, 2023, 6:34 PM IST

ప్రేమోన్మాది దాడి ఘటనతో హైదరాబాద్ ఎల్బీ నగర్ ఉలిక్కిపడింది. సంఘవి పరిస్ధితి విషమంగా వుండటంతో ఆమెను మరింత మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు డీసీపీ తెలిపారు.


ప్రేమోన్మాది దాడి ఘటనతో హైదరాబాద్ ఎల్బీ నగర్ ఉలిక్కిపడింది. పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ అక్కా తమ్ముడిపై ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. సంఘవి తమ్ముడు చింటూ ఛాతీపై తీవ్ర గాయాలు కావడంతో అతనిని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చింటూ మరణించినట్లు చెప్పారు. సంఘవి పరిస్ధితి విషమంగా వుండటంతో ఆమెను మరింత మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆమె చెప్పారు. 

కాగా.. హైదరాబాద్ ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన శివకుమార్  సంఘవి ఆమె సోదరుడు పృథ్వీపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి వచ్చిన అతను అక్కాతమ్ముళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఘర్షణ తీవ్రరూపు దాల్చడంతో శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

Latest Videos

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. అక్కాతమ్ముడిపై కత్తితో దుండగుడి దాడి, తమ్ముడు మృతి

సరిగ్గా ఇదే సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఏదో గొడవ జరుగుతుండటం, కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం రావడంతో స్థానికులు శివకుమార్‌ను బంధించారు. తీవ్ర గాయాలతో పడివున్న సంఘవి, చింటూలను కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

click me!