నిధులన్ని మీ నియోజకవర్గాలకేనా..! :మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్  

By Rajesh KarampooriFirst Published Sep 20, 2023, 12:31 AM IST
Highlights

Eatala Rajender: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నిధులన్ని సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ కేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Eatala Rajender: కేసీఆర్ సర్కార్ తీరుపై  తీరుపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిధులన్ని సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ కేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణను ధనిక రాష్ట్రమంటూనే.. అప్పుల్లోకి తోసేస్తున్నారని, నేడు కోకాపేట భూములను అమ్మితే తప్ప.. ఉద్యోగులకు జీతాలను, పింఛన్లను ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితినీ రాష్ట్రం ఎదుర్కొంటుందని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు లిక్కర్ ద్వారా రాష్ట్రానికి పదివేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఆదాయం 45 వేల కోట్లకు చేరిందని తెలిపారు. రాత్రిపూట ఊర్లలో మందు గోలీలు దొరుకుతాయో లేదో? తెలియదు గాని.. ఏ గ్రామానికి వెళ్ళినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం నిషేద శాఖ.. మద్యం విక్రయ శాఖగా మారిందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రచారమే  తప్ప.. కేవలం 8 నుండి 9 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

రాష్ట్రంలోని.. నిధులన్నీ గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్లలకేనా.. మిగతా నియోజకవర్గాల ప్రజలు పన్నులు కడతలేరా? అంటూ ప్రశ్నించారు. అంతా నీ సిద్దిపేటకేనా? .. సిద్దిపేట మంత్రి చర్చకు వస్తావా?  అంటూ మంత్రి హరీష్ రావుకు ఈటల రాజేందర్ సవాలు ఇస్తారు. 'నువ్వు రాష్ట్రానికి మంత్రివా?నీ నియోజకవర్గానికా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకను దత్తతకు తీసుకుంటానన్న మంత్రి హరీష్ రావు .. ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రైతుబంధు పథకం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు బంధువు అనేది భూస్వాములకు తప్ప కౌలు రైతులకు ఇవ్వడం లేదని అన్నారు. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించామని ప్రచారం చేసి.. రెండు లక్షల 80 వేల ఇండ్లను మంజూరు చేసి..  లక్ష 30 వేల ఇండ్లను కట్టి.. కేవలం 35000 మాత్రమే ప్రజలకు పంపిణీ చేశారని ఈటల అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని, రైతు రుణమాఫీ ఎందుకు పూర్తి స్థాయిలో చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారనీ, అందుకే.. కేసీఆర్ ప్రభుత్వం భూములను అమ్ముకున్నారనీ, రాష్ట్ర ఖజనా ఖాళీ కావడంతో  మూడు నెలలు ముందే లిక్కర్ టెండర్లు పెట్టారని ఈటల మండిపడ్డారు. 

click me!