బండి సంజయ్ టూర్: బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా

By narsimha lodeFirst Published Dec 20, 2020, 12:28 PM IST
Highlights

బీజేపీ మహాబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్  రాజీనామా చేశారు. ఆదివారం నాడు రాజీనామా లేఖను మీడియాకు పంపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలో పర్యటించే సమయంలోనే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

మహబూబ్‌నగర్: బీజేపీ మహాబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్  రాజీనామా చేశారు. ఆదివారం నాడు రాజీనామా లేఖను మీడియాకు పంపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలో పర్యటించే సమయంలోనే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన విషయంలో జిల్లాలోని పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు కూడ ఎర్ర శేఖర్ రాజీనామాకు కారణమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.బండి సంజయ్ టూర్ కు సంబంధించి మహబూబ్‌ నగర్ బీజేపీ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో టూర్ షెడ్యూళ్లలో కూడ మార్పులు చేర్పులున్నాయి. 

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో బండి సంజయ్  కు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం కూడ తనకు తెలియకుండా టూర్ ను ఫిక్స్ చేశారని ఎర్రశేఖర్ మనస్తాపానికి గురయ్యారని సమాచారం.

బండి సంజయ్ కు స్వాగతం పలికే కార్యక్రమంలో  కూడ ఎర్రశేఖర్ వర్గీయులు మరో వర్గం నేతలు వేర్వేరుగా స్వాగతం పలికారు.బండి సంజయ్ టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించి  జితేందర్ రెడ్డి, డీకే అరుణలు మార్పులు చేర్పులు చేశారని ఎర్రశేఖర్ మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది.

బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులను మీడియాకు వివరిస్తానని  ఎర్రశేఖర్ తెలిపారు.

click me!