తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు ?

By narsimha lodeFirst Published Feb 7, 2020, 6:59 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 


తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరనే చర్చ కమలనాథుల్లో మొదలైంది. ప్రస్తుతం కొనసాగుతున్న బిజెపి అధ్యక్షుడు కే లక్ష్మణ్ పదవీకాలం గత డిసెంబర్ తోనే పూర్తయింది.

 ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడి నియమకంపై  ఆ పార్టీ హైకమాండ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో ఎన్నికలు అన్ని పూర్తి కావడంతో మరో నాలుగేల్ల వరకు గ్రేటర్ మినహా మరో ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం లేదు.

Also read:బీజేపీ లో మున్సిపల్ ఎన్నికల జోష్: టీఆర్ఎస్‌పై కమలం దూకుడు

 దీంతో పార్టీ హైకమాండ్ నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సమర్థవంతంగా నడిపించే నేత ను ఎంపిక చేస్తారని తెలుస్తొంది.

 బీసీ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో మరో సామాజిక వర్గానికి చెందిన నేతను బిజెపి అధ్యక్షుడిగా నియమిస్తారని  మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే జాతీయ బిజెపి అధ్యక్షుడిగా జేపీ నడ్డా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోవడంతో రాష్ట్రల్లో కూడా పదవీ కాలం పూర్తయిన అధ్యక్షుల స్థానంలో కొత్త అధ్యక్షులను నియమిస్తారని పార్టీ నేతలు అంత్యన్నారు.

 రాష్ట్రంలో పార్టీ పగ్గాలు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ల పేర్లు ప్రాముఖంగా వినిపిస్తునాయి.ఈ ఇద్దరిలో ఒకరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు  అంటున్నారు.

 మరో నెల రోజుల్లో బిజెపికి కొత్త అధ్యక్షుడు తెలంగాణ రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్ గా పార్టీ హైకమాండ్ చర్చించక పోవడంతో లక్ష్మన్ ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది.
 

click me!