పెళ్లికి కట్నకానుకలు: హైద్రాబాద్‌లో ఇద్దరు యువతుల సూసైడ్

Published : Feb 07, 2020, 06:43 PM IST
పెళ్లికి కట్నకానుకలు: హైద్రాబాద్‌లో ఇద్దరు యువతుల సూసైడ్

సారాంశం

పెళ్లికి కట్నకానుకలు ఇవ్వాల్సి వస్తోందనే భయంతో  ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.  

హైదరాబాద్: పెళ్లికి భారీగా కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తోందనే కారణంగా ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ ఇద్దరు యువతుల్లో ఒక యువతికి పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ తరుణంలో   ఆత్మహత్యకు పాల్పడడడం విషాదం నెలకొంది.

హైద్రాబాద్‌ హయత్‌నగర్ పట్టణంలో  ఇద్దరు యువతులు మమత, గౌతమిలు డిగ్రీ చదువుతున్నారు. మమతకు పది రోజుల్లో వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.

అయితే  ఒకే రూమ్‌లో మమత, గౌతమిలు ఆత్మహత్య చేసుకొన్నారు. వీరి మృతదేహల వద్ద సూసైడ్ నోట్ లభించింది. పెళ్లి చేసుకోవాలంటే భారీగా కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తోందనే నెపంతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.

మరో ఆడపిల్లకు కష్టం రాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!