ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారా ? కేంద్ర నేతలతో చర్చలు !!

Published : May 25, 2021, 10:57 AM IST
ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారా ? కేంద్ర నేతలతో చర్చలు !!

సారాంశం

తెలంగాణ మాజీ మంత్రి, కీలక నేత ఈటెల రాజేందర్ కు బీజేపీ గాలం వేసిందా? ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి, కాషాయ కండువ కప్పడానికి రాష్ట్ర పెద్దలు, కొందరు కేంద్రం నుంచి వచ్చిన నేతలు సన్నాహాలు చేస్తున్నారా? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అక్షరాల నిజమనిపిస్తుంది. 

తెలంగాణ మాజీ మంత్రి, కీలక నేత ఈటెల రాజేందర్ కు బీజేపీ గాలం వేసిందా? ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి, కాషాయ కండువ కప్పడానికి రాష్ట్ర పెద్దలు, కొందరు కేంద్రం నుంచి వచ్చిన నేతలు సన్నాహాలు చేస్తున్నారా? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అక్షరాల నిజమనిపిస్తుంది. 

మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ గూటికి చేరతారా..? లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? ఇవి రెండూ కాకుండా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆయనతో చర్చించడం, తాజాగా బీజేపీ జాతీయ నేతే హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరపడంతో మరోసారి ఈటెల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. 

ఈటల రాజేందర్ తో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు ఈటెలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫాం హౌస్ లో జరిగిన ఓ సమావేశంలో ఈటెలతో కలిసి బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భూపేందర్ యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. అయితేబిజెపిలో చేరే అంశంపై ఈటెల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదు. పార్టీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ ఆహ్వానంపై ఇంతవరకు ఈటెలస్పందించలేదు.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పైనే కాకుండా, ముఖ్యమంత్రి కెసిఆర్ పైన ఎదురుదాడికి దిగిన క్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం తనకు లేదని సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల  కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 

కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలని ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజురాబాద్ కు ఉప ఎన్నిక తీసుకువచ్చి, అక్కడ గెలిచి టిఆర్ఎస్ కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలని ఉద్దేశంగా చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu