ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ చేకూరి కాశయ్య మృతి

Published : May 25, 2021, 10:19 AM IST
ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ చేకూరి కాశయ్య మృతి

సారాంశం

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ చేకూరి కాశయ్య మంగళవారంనాడు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించాడు. 

ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ చేకూరి కాశయ్య మంగళవారంనాడు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సుధీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. 1978లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి ఆయన విజయం సాధించారు. వనమా వెంకటేశ్వరరావుపై ఆయన ఆ సమయంలో గెలుపొందారు. 

ఇదే అసెంబ్లీ స్థానం నుండి కోనేరు నాగేశ్వరరావు చేతిలో  1983లో ఆయన ఓటమి పాలయ్యాడు. సుజాతనగర్ అసెంబ్లీ స్థానం నుండి 1994 ఎన్నికల్లో కూడ ఆయన ఓటమి పాలయ్యాడు.ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి రజబ్ అలీ చేతిలో చేకూరి కాశయ్య ఓడిపోయాడు. నిరాండబర జీవితానికి చేకూరి కాశయ్య  పెట్టింది పేరు. అజాతశత్రువుగా ఆయనకు పేరుంది.

సుదీర్థకాలంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన పేరున స్వంత కారు, ఇల్లు లేదు.  ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఆయన జన్మించాడు.  1946 లో ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో  గాంధీ ప్రసంగం విన్నారు.ఈ ప్రసంగం తన జీవితాన్ని మలుపు తిప్పిందని కాశయ్య చెబుతండేవాడు.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!