హలియాలో కేసీఆర్ సభ: బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

Published : Feb 10, 2021, 05:29 PM IST
హలియాలో కేసీఆర్ సభ: బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

సారాంశం

నల్గొండ జిల్లాలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బుధవారం నాడు హలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభను అడ్డుకొంటామని బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

నాగార్జునసాగర్: నల్గొండ జిల్లాలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బుధవారం నాడు హలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభను అడ్డుకొంటామని బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.దీన్ని పురస్కరించుకొని హలియాలో సీఎం కేసీఆర్ సభను టీఆర్ఎస్ ఇవాళ నిర్వహించింది.

ఈ సభను అడ్డుకొంటామని బీజేపీ ముందుగా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో  బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.  బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిని పోలీసులు పెద్దవూర మండలం పులిచర్లలో హౌస్ అరెస్ట్ చేశారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.  బీజేపీ నేతలు హలియా వైపునకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్తానానికి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నాగార్జునసాగర్  ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు