బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర... కేసీఆర్ పుట్టినరోజున సమర్పణ

Arun Kumar P   | Asianet News
Published : Feb 10, 2021, 04:52 PM IST
బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర... కేసీఆర్ పుట్టినరోజున సమర్పణ

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున బల్కంపేట అమ్మవారికి సమర్పించడానికి దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా చీరను తయారు చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

హైదరాబాద్:  ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున హైదరాబాద్ లోని పలు హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యంగా నగరంలోని ప్రసిద్ద దేవాలయం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు పట్టుచీరను సమర్పించనున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా చీరను తయారు చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

ఫిబ్రవరి 17న ఉదయం 6గంటలకు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, 9 గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజల అనంతరం భక్తులందరికి అన్నప్రసాద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా  ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 15 నుండి 17 వ తేదీ వరకు కోటి కుంకుమార్చన, 17వ తేదీన నవగ్రహ, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కోటి కుంకుమార్చన లో పాల్గొన్న 250 మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

ఇక సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణపతి కళ్యాణం, విశేష అభిషేకాలు, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  
 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు