పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు...(వీడియో)

By AN TeluguFirst Published Nov 6, 2021, 3:00 PM IST
Highlights

రోడ్డు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని ఎన్నోసార్లు అడిగామని..  Road repair చేపిస్తాన‌ని ఎన్నోసార్లు వాగ్ధానాలు చేసి వాటిని చేయ‌డం లేద‌ని bjp leaders రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. 

యాంక‌ర్ : సుల్తానాబాద్ మండ‌లం కొదురుపాక ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హాకార సంఘం ఆధ్వ‌ర్యంలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి వ‌స్తున్న పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిని బీజేపీ నాయ‌కులు అడ్డుకున్నారు.

"

రోడ్డు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని ఎన్నోసార్లు అడిగామని..  Road repair చేపిస్తాన‌ని ఎన్నోసార్లు వాగ్ధానాలు చేసి వాటిని చేయ‌డం లేద‌ని bjp leaders రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. 

కాల్వ నీటిని  స‌ర‌ఫ‌రా చేయాల‌ని వారు ఆందోళ‌న చేప‌ట్టారు.  వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని ఆందోళ‌నకారుల‌ను అడ్డుకున్నారు ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య స్వ‌ల్ప తోపులాట చోటు చేసుకుంది. 

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నాయ‌కుల‌తో పాటు గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

ఆ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న ఉప ఎన్నిక భయం.. అసలు ఏం జరుగుతోంది...

ఇదిలా ఉండగా..తెలంగాణ బీజేపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. Dalitha bandhuను వెంటనే అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని Bjp నిర్ణయం తీసుకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో  దళిత బంధును ఎన్నికల సంఘం నిలిపివేసింది. 

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన Election Commission ఉప ఎన్నికలు ముగిసే వరకు దళిత బంధును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే గత మాసం 25వ తేదీన జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో Kcr కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధును ఎన్నికల సంఘం నవంంబర్ 4వ తేదీ వరకే నిలుపుదల చేస్తోందన్నారు. నవంబర్ 4  తర్వాత ఈ పథకాన్ని ఆపడం ఈసీకి సాధ్యమా అని ప్రశ్నించార. నవంబర్ 4 వ తేదీ తర్వాత దళితబంధును కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే దళిత బంధును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని  బీజేపీ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం హుజూరాబాద్ తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని  శాలపల్లి గ్రామంలో కేసీఆర్ ప్రారంభించారు.  రైతు బంధు పథకాన్ని  కూడా ఇదే గ్రామం నుండి కేసీఆర్ ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ గ్రామంలో బీజేపీకే అధిక ఓట్లు వచ్చాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దళిత బంధు పథకం విజయాన్ని అందించలేకపోయిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకాన్ని అడ్డుపెట్టుకొని తమపై టీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేశారని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని నవంబర్ 4 నుండే అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సమయంలో వచ్చిన లోటుపాట్లను సరిదిద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

click me!