టీ.కాంగ్రెస్‌కు మరో షాక్ : పార్టీనీ వీడనున్న ప్రేమ్‌సాగర్ రావు, నవంబర్ 10 వరకు డెడ్‌లైన్.. లేకుంటే..?

By Siva KodatiFirst Published Nov 6, 2021, 2:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు (prem sagar rao) హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌ (uttara telangana indira congress) పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రేమసాగర్ రావు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అసలే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో (huzurabad bypoll) ఓటమితో తీవ్ర నిరాశలో వున్న తెలంగాణ కాంగ్రెస్‌కు (congress) మరో షాక్‌ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు (prem sagar rao) హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌ (uttara telangana indira congress) పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రేమసాగర్ రావు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి శనివారం అనుచరులు, మద్ధతుదారులతో ఆయన సమావేశమవుతున్నారు. దీని తర్వాత ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీనే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతోందని ప్రేంసాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులను వదిలేసి ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడంపై ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రవెళ్లి సభకు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులను విస్మరించడం దారుణమన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పార్టీలో ప్రక్షాళన చేయాలన్న ప్రేంసాగర్.. కార్యకర్తల అభీష్టం మేరకు ముందుకు వెళతామన్నారు. ఈనెల 10 వరకు అధిష్టానానికి డెడ్‌లైన్ పెట్టిన ఆయన... ఆ తరువాత మా దారి మేం చూసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టేందుకు సైతం సిద్దంగా ఉన్నామన్నారు.

Also Read:Huzurabad bypoll Result 2021: కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ ఆదేశం

మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ (manickam tagore) ఆదేశించారు. ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  కమిటీని ఏర్పాటు చేసింది. గాంధీ భవన్ లో  బుధవారం నాడు Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు. ఈ భేటీ సుధీర్ఘంగా జరిగింది.ఈ సమావేశంలో  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనే పార్టీ నేతలు సీరియస్ గా చర్చించారు.పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియాగాంధీతో చర్చించాలని ఆయన సూచించారు. పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని ఠాగూర్ సూచించారు.

click me!