టీఆర్ఎస్‌తో కొట్లాడాలంటే బీజేపీయే: కౌశిక్ రెడ్డి బహిష్కరణపై విజయశాంతి స్పందన

By Siva KodatiFirst Published Jul 12, 2021, 10:03 PM IST
Highlights

కాంగ్రెస్‌కు ఓటు వేసినా టీఆర్ఎస్, ఎంఐఎంలకు వేసినట్లేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం కళ్లముందే వుందని ఆమె ఎద్దేవా చేశారు. 
 

కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి బహిష్కరణకు గురైన నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తెలంగాణలో ఎన్నికల్లో కొట్లాడాలంటే బీజేపీయేనన్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికలు సాధ్యపడదనే అభిప్రాయంలో వున్నారని విజయశాంతి తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించినా టీఆర్ఎస్‌లోనే చేరుతారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా టీఆర్ఎస్, ఎంఐఎంలకు వేసినట్లేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం కళ్లముందే  వుందని ఆమె ఎద్దేవా చేశారు.

ఆదివారం సాయంత్రం కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విజయేందర్ రెడ్డితో కౌశిక్ మాట్లాడిన ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. 

Also Read:తన అనుచరుడే.. కానీ పార్టీ మారాడు, విషయం తెలియక ‘‘ గుట్టు ’’విప్పేసి : అడ్డంగా బుక్కైన కౌశిక్

త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని, కొంత‌మంది నేత‌ల‌కు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన బేర‌సారాలు బ‌య‌ట‌కు పొక్క‌టంతో కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం సీరియ‌స్ అయ్యింది. 24గంట‌ల్లో సంజాయిషీ ఇవ్వాల‌ని... స‌రైన స‌మాధానం రాక‌పోతే పార్టీ నుండి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది. కానీ సాయంత్రానికి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 

click me!