అడ్డగూడూరు లాకప్‌డెత్ ఘటనలో కీలక పరిణామం: బాధ్యులైన పోలీసులపై కేసులు

By Siva KodatiFirst Published Jul 12, 2021, 8:19 PM IST
Highlights

అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసులో పోలీసులపై కేసులు నమోదు చేశారు ఉన్నతాధికారులు. ఇప్పటికే ఎస్సై మహేశ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయగా.. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమీషనరేట్‌కు అటాచ్ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసులో పోలీసులపై కేసు నమోదు చేశారు. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసులు ఫైల్ చేశారు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు పోలీస్ అధికారులపై నమోదయ్యాయి. ఇప్పటికే మరియమ్మ లాకప్‌డెత్‌పై జ్యూడీషియల్ విచారణ కొనసాగుతోంది. లాకప్‌డెత్ కేసులో ఇప్పటికే ఎస్సై మహేశ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమీషనరేట్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Also Read:అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసు: మరో అధికారిపై సర్కార్ వేటు

దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. లాకప్‌డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఇలాంటి ఘటనలు క్షమించనని సీఎం తేల్చి చెప్పారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ కొడుకు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకొంటుందని  సీఎం హామీ ఇచ్చారు.

click me!