నా రాజకీయ ప్రస్థానానికి 24 ఏళ్లు.. మీ అభిమానం ఇలాగే వుండాలి : విజయశాంతి ఎమోషనల్ ట్వీట్

By Siva KodatiFirst Published Jan 27, 2022, 4:17 PM IST
Highlights

హీరోలతో సమానంగా డ్యాన్సులు, ఫైట్స్‌లో తనదైన ముద్రవేసి లేడీ సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి (vijayasanthi).. అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి ఆపై ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియా ద్వారా  స్పందించారు

హీరోలతో సమానంగా డ్యాన్సులు, ఫైట్స్‌లో తనదైన ముద్రవేసి లేడీ సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి (vijayasanthi).. అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి ఆపై ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియా ద్వారా  స్పందించారు. నిన్నటితో తన రాజకీయ జీవితానికి 24 ఏళ్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.

1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చానని .. తన రాజకీయ ప్రస్థానం 25వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా తనకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు విజయశాంతి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఇక విజయశాంతి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే..తొలుత ఆమె బీజేపీలో (bjp) చేరారు. అనంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీకి గుడ్‌బై చెప్పి.. 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల పాటు తన పార్టీని నడిపిన అనంతరం టీఆర్ఎస్‌లో (trs) విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్‌లో (congress) చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరారు

click me!