హైద్రాబాద్ అల్వాల్ లో బీజేపీ నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్: పోలీసుల గాలింపు

Published : Jul 14, 2023, 10:08 AM ISTUpdated : Jul 14, 2023, 02:04 PM IST
హైద్రాబాద్ అల్వాల్ లో  బీజేపీ నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్: పోలీసుల గాలింపు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని అల్వాల్ లో  బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు  తిరుపతి రెడ్డి కిడ్నాప్‌నకు గురయ్యాడు.  

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ లో  బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరుపతి రెడ్డి  కిడ్నాప్ నకు గురయ్యాడు.  ఈ విషయమై  తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు  చేసింది.  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పై  తిరుపతి రెడ్డి భార్య అనుమానం వ్యక్తం  చేసింది.ఈవిషయమై  పోలీసులకు ఫిర్యాదు  చేసింది.

జనగామ జిల్లా  దుబ్బకుంటపల్లి కి చెందిన  తిరుపతి రెడ్డి  హైద్రాబాద్ కుషాయిగూడలో కుటుంబ సభ్యులతో  నివాసం ఉంటున్నాడు.   5,929 గజాల విషయంలో ప్రతర్థులతో  తిరుపతి రెడ్డికి వివాదం ఉందని కుటుంబ సభ్యులు  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్వాల్  తహసీల్దార్ కార్యాలయం నుండి బయటకు రాగానే  తిరుపతి రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  తిరుపతి రెడ్డి ఆటోలో వెళ్తున్న విషయాన్ని సీసీటీవీ పుటేజీలో  పోలీసులు  గుర్తించారు. ఇదిలా ఉంటే  భూ వివాదం నేపథ్యంలోనే  తిరుపతిరెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని  కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా  తిరుపతి రెడ్డి  సరిగా నిద్ర కూడ పోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?