తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో శుక్రవారం నాడు భేటీఅయ్యారు.
హైదరాబాద్ తెలంగాణ మాజీ శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు కేసీఆర్ తో భేటీ అయ్యారు బీజేపీకి స్వామిగౌడ్ రాజీనామా సమర్పించారు. రాజీనామా పత్రాన్నిబీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు.. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో శుక్రవారం నాడు ఆయన భేటీఅయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నవారికి కేసీఆర్ ఫోన్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు విఠల్ గౌడ్ లకు కేసీఆర్ పోన్లను చేశారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా స్వామిగౌడ్ ఇవాళ కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గా స్వామిగౌడ్ పనిచేశారు. రాజేంద్రనగర అసెంబ్లీ స్థానం నుండి స్వామిగౌడ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. అయితే రాజేంద్రనగర్ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కే కేటాయించారు.
అంతేకాదు పార్టీ నాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరుతో మనోవేదనకు గురైన స్వామిగౌడ్ 2018 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. అప్పటి నుండి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ స్థానంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. వీరిలో గౌడ్లు, పద్మశాలి,యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు గణనీయంగా ఉన్నారు.
alsoread:తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ఫోన్లు:బీజేపీకి దాసోజు గుడ్ బై, అదే బాటలో మరికొందరు నేతలు
మునుగోడులో బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకుగాను టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పల్లె రవికుమార్ ను , బీజేపీలో ఉన్న బూడిద బిక్షమయ్య గౌడ్ లను తమ పార్టీలోకి ఆహ్వానించింది టీఆర్ఎస్. దాసోజు శ్రవణ్ , స్వామిగౌడ్ లు ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో వీరిద్దరూ చేరనున్నారు. మునుగోడులో విజయం కోసం టీఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్ లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో ఇతర పార్టీల్లో కీలక నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్ కుమార్, స్వామిగౌడ్ లను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ తమ వైపునకు తిప్పుకుంది.
మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీన జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానిక ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.