వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే వరి పై పోరు: కేసీఆర్ పై మురళీధర్ రావు ఫైర్

Published : Apr 05, 2022, 03:03 PM ISTUpdated : Apr 05, 2022, 03:10 PM IST
వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే వరి పై పోరు: కేసీఆర్ పై మురళీధర్ రావు ఫైర్

సారాంశం

వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత ముళీధర్ రావు విమర్శించారు. తమ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లకుండా వరి ధాన్యం అంశాన్ని టీఆర్ఎస్ తెర మీదికి తెచ్చిందన్నారు. 

హైదరాబాద్: Boiled Rice ను ఇవ్వబోమని Telangana ప్రభుత్వం కేంద్రానికి లిఖిత పూర్వకంగా రాసిచ్చిందా లేదో చెప్పాలని బీజేపీ  నేత P. Muralidhar Rao ప్రశ్నించారు.

బుధవారం నాడు మురళీధర్ రావు Hyderabad లోని BJP  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. KCR తన పాలనలో వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే Paddyధాన్యం అంశాన్ని ఎంచుకొన్నారని మురళీధర్ రావు విమర్శించారు.  వరి ధాన్యం విషయంలో కేంద్రంపై నెపం నెట్టేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. 

కేంద్రంపై నిందలు వేసి Farmersల్లో బీజేపీపై విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసిచ్చిందన్నారు. ఇప్పుడు బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయాలని కేంద్రంపై ఎలా ఒత్తిడి తెస్తారని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.

వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తుంది. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేసింది.ఈ నెల 6న జాతీయ రహదారులను దిగ్భంధనం చేయనుంది. ఈ నెల 11న  Delhiలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయనుంది. 

ఈ నిరసన కార్యక్రమాలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు  విషయమై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల నుండి ఏ రకంగా ధాన్యం కొనుగోలు చేశారో తెలంగాణ రాష్ట్రం నుండి కూడా వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు

వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత ముళీధర్ రావు విమర్శించారు. తమ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లకుండా వరి ధాన్యం అంశాన్ని టీఆర్ఎస్ తెర మీదికి తెచ్చిందన్నారు. 

వరి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ తిప్పికొడుతుంది. బీజేపీ నేతలు రైతులను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ విమర్శిస్తుంది.రెండు పార్టీలు ఈ అంశంలో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది.

వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను టీఆర్ఎస్ ఈ నెల 4వ తేదీ నుండి  ఆందోళనలకు పిలుపునిచ్చిందిత.ఈ నెల 11న ఢిల్లీలో ఆందోళనలకు కూడా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. అయితే పార్లమెంట్ సమావేశాలు పూర్తైన తర్వాత ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఏం ఉపయోగమని కూడా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.

రైతాంగ ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం చర్యలు తీసుకోనేందుకు  చొరవ తీసుకోవాలని  కాంగ్రెస్ పోర్టీ కోరింది. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు తెలంగాణ తరహ పోరాటం చేస్తామని కేసీఆర్ ఇఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్