అసదుద్దీన్ పై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

Published : Nov 21, 2018, 02:10 PM IST
అసదుద్దీన్ పై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ రూ.25 లక్షలు ఇవ్వాలని చూసిందన్న అసదుద్దీన్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఎంత ప్యాకేజ్‌ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.   

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ రూ.25 లక్షలు ఇవ్వాలని చూసిందన్న అసదుద్దీన్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఎంత ప్యాకేజ్‌ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌తో కాపురం చేసేందుకు ఎంఐఎం సిద్ధమైందని మండిపడ్డారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఒవైసీ వాళ్ల వద్దకు వెళ్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్‌ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మరోవైపు టీఆర్ఎస్ పార్టీపైనా కృష్ణసాగర్ రావు నిప్పులు చెరిగారు. మద్యం అమ్మకాల్లో, నేరాల పెరుగుదలలో, దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద అంక్షలు పెట్టడంలో టీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే అవినీతిలో, అబద్దాలు చెప్పడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నంబర్‌ 1 స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని ఈ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారతాయని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన రూ.500 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?